పెరగనున్న ఆదాయం
చాలా ఏళ్ల తర్వాత మరోమారు భువన్ యాప్ ద్వారా ఒకే ప్రాంతంలో ఒకే విస్తీర్ణంలో, ఒకేలా ఉన్న నిర్మాణాలు విధించడంలో తేడాలు ఉన్నాయి. రివిజన్ పటిషన్ల పేరుతో అంతస్తులను ఎగరగొట్టడం, పెంచి పన్నులను తగ్గించడం, దస్త్రాలను కొంచెం అటూ ఇటుగా మార్చి చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు కనుమరుగయ్యాయి. పాష్, పోష్, కమర్షియల్, రెసిడెన్షియల్ నిర్మాణాలపై చర్యలు కనుమరుగయ్యాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ అవకతవకలను చూసీచూడనట్లుగా ఉంటూ తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పలువురు ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు ఇష్టారాజ్యంగా ఇంటి నంబర్లు కేటాయించారు. సుమారుగా నగరంలో 10 వేల ఇళ్లకు బై నంబర్లు కేటాయించారు. మరో 5 వేల ఇళ్లకు నంబర్లు లేవు. దీనివల్ల కార్పొరేషన్ సమకూర్చాల్సిన రూ.కోట్ల ఆదాయం చేజారిపోతోంది. భువన్ యాప్ ద్వారా ప్రతీ అంగుళం స్థలం నుంచి ఆస్తి పన్ను రాబట్టుకోనున్నారు. ఈ నేపథ్యంలో బల్దియాకు గత ఆర్థిక సంవత్సరం రూ.95 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత భువన్ యాప్ ట్యాగ్ ద్వారా 20 శాతం ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
వరంగల్ అర్బన్: భవన నిర్మాణాల్లో, ఆస్తుల లెక్కింపులో ఉన్న లోసుగులను అవినీతితో ముడిపెట్టిన పన్నుల విభాగం అధికార యంత్రాంగం వాటిని సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు తొమ్మిదేళ్ల తర్వాత మరోమారు భువన్ యాప్ ద్వారా ఆస్తులను ‘ఆన్‌లైన్’లో నిక్షిప్తం చేయాలని వారం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో భువన్ యాప్ ద్వారా పన్ను మదింపు చేయనివి, మదింపు చేసిన భవనాల వివరాలన్నీ బట్టబయలు చేయాలని బల్దియా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో వారం రోజులుగా పన్నుల విభాగం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ఎక్కువ, తక్కువలు నిర్ధారించి తేడాలను కట్టడిచేసే పన్నుల్లో నిమగ్నమయ్యారు. త్వరలో డ్రోన్ ద్వారా ఆస్తుల పన్ను మదింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు వివరాలు బహిర్గతం కానున్న తరుణంలో అసెస్‌మెంట్ల వివరాలన్నీ భువన్ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోమారు చిత్రాలు, విస్తీర్ణంతో సహా ఇతర అంశాలు సేకరించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు.
అప్పుడు ఆగమాగం..
2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా నగరంలో పదివేల ఇళ్లు లెక్కకు రాకుండా పోయినట్లు తేలింది. ఎలాగోలా ఆయా ఆస్తులను భువన్ యాప్‌లో, 1,64,383 ఇళ్ల వివరాలను నమోదు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత మరోమారు రాష్ట్ర పురపాలక శాఖ భువన్ యాప్ ద్వారా రివైజ్డ్ చేయాలని సూచనలిచ్చింది. వరంగల్ మహానగర పాలకసంస్థ పరిధిలో ప్రస్తుతం ప్రైవేట్, ప్రభుత్వ నివాస, వాణిజ్య, విభాగాల్లో సుమారు 2.40 లక్షల అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో భవనాలు, ఖాళీ స్థలాలు, నిర్మాణాలకు సంబంధించిన కార్పొరేషన్ రికార్డులు, ఖాళీ స్థలం ఉన్న చోట నిర్మాణాలకు ఉండడం, ఒకే అంతస్తు అని పేర్కొన్న చోట బహుళ అంతస్తులు ఉన్నట్లు సర్వేలో బహిర్గతం కానుంది. అంతేకాకుండా.. నివాస యోగ్యమైన భవనంలో కొంత భాగం కమర్షియల్ వినియోగించడం, అదనపు అంతస్తులు తదితరుల వివరాలు తేటతెల్లం కానున్నాయి.
డ్రోన్ సర్వేతో తేడాల గుర్తింపునకు ముందస్తు దిద్దుబాటు చర్యలు
పక్కాగా ఆస్తి పన్ను మదింపునకు
పురపాలక శాఖ ఆదేశాలు
20 శాతం ఆస్తి పన్ను పెంపు లక్ష్యంగా కొనసాగుతున్న సర్వే


