? | - | Sakshi
Sakshi News home page

?

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

‘కాని’దైనా చేస్తాడు! ? ‘కాసు’కుని ఉంటాడు..

ప్రతీ పనికీ ఓ లెక్క.. కాదంటే జాప్యం

‘కాని’దైనా చేస్తాడు!
ఓ తహసీల్దార్‌ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించాల్సిన వేదికలు. కానీ అక్కడి సేవలపై ఫిర్యాదులు వెల్లువెత్తితే పాలన తీరుపై ప్రశ్నలు తలెత్తుతాయి. హనుమకొండ జిల్లాలోని ఓ మండల రెవెన్యూ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారం, ధ్రువపత్రాల జారీ, రికార్డుల సవరణ వంటి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని స్థానికుల నుంచి ఆరోపణలున్నాయి. కొన్ని పనుల పరిష్కారానికి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదులూ ఉన్నాయి. మరోవైపు ఆ మండల పరిధిలో మట్టి, మొరం తవ్వకాలు.. అక్కడి తహసీల్దార్‌ తీరు స్థానికంగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుండగా, తాజాగా సీఎస్‌ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయన్న ప్రచారం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మట్టి, మొరం తవ్వకాలపై వివాదం!

వరంగల్‌ నగరానికి సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ మండలంలోని రెండు, మూడు గ్రామాల్లో మట్టి, మొరం తవ్వకాల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. జేసీబీలు, టిప్పర్లతో పెద్ద ఎత్తున జరిగిన తవ్వకాలపై ఆరోపణలున్నాయి. ఈ తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ మేరకు ఇచ్చారు? అనుమతించిన పరిమాణానికి మించి తవ్వకాలు జరిగాయా? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత రావాల్సి ఉంది. ఈ తవ్వకాల వ్యవహారంలో ఇప్పటివరకు చేపట్టిన తనిఖీలు, తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ సేవలపై వస్తున్న ఫిర్యాదులు, మట్టి–మొరం తవ్వకాల వివాదంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రజలకు అందాల్సిన రెవెన్యూ సేవల్లో జాప్యం జరుగుతోందన్న ఫిర్యాదులు ఆందోళన కలిగిస్తున్నాయి. భూములకు సంబంధించిన పనుల కోసం కార్యాలయానికి వెళ్లే రైతులు, సామాన్యులు పలుమార్లు తిరగాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ కొర్రీలు పెడుతూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల ఆ మండలంలో గౌడ సంఘం స్థల వివాదం కూడా చర్చనీయాంశమైంది. భూ రికార్డుల సవరణ, మ్యుటేషన్లు, పట్టాదారు పాస్‌బుక్‌ సమస్యలు, భూ సరిహద్దుల వివాదాల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రతీ పనిలోనూ జాప్యం.. ముడుపుల డిమాండ్‌ అంటూ ఆరోపణలు

ఆ మండలంలో మట్టి, మొరం తవ్వకాలపై వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement