టీజీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

టీజీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

టీజీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: టీజీపీఎస్సీ నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌–1) పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న టీజీపీఎస్సీ పరీక్షలకు 3,650 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. వడ్డేపల్లిలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌, శ్రీ గాయత్రి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, మోక్షిత్‌ కంప్యూటర్స్‌, ఎన్‌ఎస్‌ గ్లోబల్‌ టెక్నాలజీస్‌, నోబెల్‌ టెక్నాలజీ అండ్‌ సొల్యూషన్‌ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్టీసీ డీఎం ధరంసింగ్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి గౌరీశంకర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement