వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

‘వీర్‌గాథ’లో జనగామ సత్తా

విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత భావం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వీర్‌ గాథ 6.0 కార్యక్రమంలో జనగామ సత్తాచాటింది.

నెక్కొండ : ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ పనులు తగ్గి.. వీబీ జీరామ్‌జీ పనులకు వెళ్లే కూలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో కంటే ఎక్కువ మంది పనులకు వస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జూలై 1నుంచి అమల్లోకి వచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (వీబీ జీరామ్‌జీ) కొత్త చట్టం ప్రకారం కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల పని కల్పించాలి. కూలీలకు రోజుకు కనీసం వేతనం రూ.240 కాగా, గరిష్టంగా రూ.307 వరకు అందుతుంది.

ఎల్‌నినో ప్రభావంతో..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాల్లో కరువు చాయలు అలుముకున్నాయి. వానాకాలంలో పంటలు సక్రమంగా పండక పేదలకు చేతి నిండా పనులు లేకుండా పోయాయి. యాసంగి సీజన్‌ ఆరంభమైనా అన్నదాతల్లో ఉత్సాహం కనిపించడం లేదు. బోరు బావులు వట్టిపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అనేక మంది కూలీలు అనుభవం లేకున్నా ఇతర పనులు చేసేందుకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వలస వెళ్లకుండా ఉన్నచోటనే పని చేసుకునేందుకు గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీకార్డు ఉపయోగపడుతుంది. ఇది చేతిలో ఉంటే చాలు నిరభ్యంతరంగా పనులకు వెళ్లొచ్చు.

అర్హులు

ఎవరంటే..

జాబ్‌కార్డు పొందాలంటే కనీసం 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒక కుటుంబానికి ఒకే కార్డు జారీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు. ఆదాయ పన్ను చెల్లించే వారు అనర్హులు.

జిల్లాలో 317 గ్రామాలు..

1,20,608 లక్షల జాబ్‌కార్డులు

జిల్లాలో 13 మండలాలుండగా.. 317 గ్రామ పంచాయతీలున్నాయి. మొత్తం 1,20,608 జాబ్‌కార్డులుండగా.. వాటిలో 72,035 క్రియాశీలక జాబ్‌ కార్డులు ఉన్నాయి. 2,40,968 మంది కూలీలు ఉన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రభుత్వం వీబీ జీరామ్‌జీ పథకంగా ద్వారా పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెచ్చింది. ఈ క్రమంలో ప్రతీ కూలీకి గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీకార్డు అందజేసి పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కూలీలకు వీబీ జీరామ్‌జీ పనులు

రూ. 240 నుంచి రూ.307కి

పెరిగిన వేతనం

ఎల్‌నినో నేపథ్యంలో

గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం

కార్డులు

పొందండిలా..

గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీకార్డు పొందాలంటే ఫారం –6 లేదా తెల్లకాగితంపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ఎంపీడీఓ పరిశీలించి 15 రోజుల్లోగా కార్డు మంజూరు చేస్తారు. ఆధార్‌, బ్యాంక్‌ లేదా పోస్టాఫీసు ఖాతా వివరాలు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, సెల్‌ నంబరు, రేషన్‌కార్డును జత చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement