పేద కుటుంబాల్లో సొంతింటి వెలుగులు | - | Sakshi
Sakshi News home page

పేద కుటుంబాల్లో సొంతింటి వెలుగులు

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

దుగ్గొండి : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతూ వారి సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని చలపర్తి గ్రామంలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కోటగిరి ప్రేమలత–భాస్కర్‌, మమత–రవీందర్‌, కక్కెర్ల ఉమ–శ్రీనివాస్‌ ఇళ్లల్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ హాజరయ్యారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపాలు వెలిగించారు. అలాగే కేదారేశ్వర వ్రతాల్లో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాపాలనలో సొంతిళ్లు లేనివారికి ఇళ్లు మంజూరు చేశామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గ వ్యాప్తంగా 2వేల ఇళ్లు పూర్తి కాగా, మరో 2 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, రెండో విడత ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు. కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, హౌసింగ్‌ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ కోఆర్డినేటర్‌ తోకల శ్రీనివాసరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చింతల సాంబరెడ్డి, నర్సంపేట మండల అధ్యక్షుడు కత్తి కిరణ్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్లు చెన్నూరి కిరణ్‌రెడ్డి, ఒలిగె నర్సింగరావు, ఇంగోళి రాజేశ్వర్‌రావు, డీటీ రఘు, సర్పంచ్‌ కోటగిరి భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శి కావ్య, హౌసింగ్‌ ఏఈ ఉపేందర్‌, నాయకులు యాదవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో

దీపావళి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement