రైతుల సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమానికి పెద్దపీట

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

వర్ధన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన మెగా రైతు మేళా కార్యక్రమాన్ని పట్టణ కేంద్రంలోని రైతువేదికలో ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్‌ సత్యశారద, రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడొద్దని ఎల్‌నినో కారణంగా సాగునీటి సమస్య ఏర్పడిందని చెప్పారు. యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి, వైస్‌ చైర్మన్‌ షీబారాణి రాజేందర్‌, కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ పులి ప్రియాంక, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ముఖ్యనాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

15మంది ఎస్సైల బదిలీలు

హసన్‌పర్తి: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 15 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈమేరకు సోమవారం రాత్రి పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. పి.తిరుపతి ఆత్మకూర్‌ నుంచి కొడకండ్ల, ఎన్‌.చెన్నకేశవ్‌ జనగామ నుంచి తరిగొప్పు ల, ఎం.రమేశ్‌ సీసీఆర్‌బీ వరంగల్‌ నుంచి పీసీఆర్‌ వరంగల్‌, కె. హరికృష్ణ పీసీఆర్‌ అండ్‌ అటాచ్డ్‌ టు సీసీఆర్‌బీ వరంగల్‌ నుంచి సీసీఆర్‌బీ వరంగల్‌, కళ్యాణ్‌కుమార్‌ కేయూసీ నుంచి సీటీసీ వరంగల్‌, టి.శ్రావణి మిల్స్‌కాలనీ అటాచ్డ్‌ టూ ఏహెచ్‌టీయూ నుంచి సుబేదారి, నైనాల నాగభూషణం అలియాస్‌ నగేష్‌ సీసీఎస్‌ వరంగల్‌ నుంచి హసన్‌పర్తి, సీహెచ్‌ రవికుమార్‌, వరంగల్‌ నుంచి జనగామ, ఎండీ ఫసీయోద్దీన్‌ వరంగల్‌ ట్రాఫిక్‌ ను ంచి సీసీఎస్‌ వరంగల్‌, డి.వి. పాణి సుబేదారి నుంచి వరంగల్‌ ట్రాఫిక్‌, డి.సాంబయ్య మట్టెవాడ నుంచి కేయూసీ, ఎం.శంకర్‌ పీసీఆర్‌ వరంగల్‌ నుంచి మడికొండ, ఎం.కుమారస్వామి పీసీఆర్‌ వరంగల్‌ నుంచి ఆత్మకూర్‌, టి.కృష్ణమూర్తి పీసీఆర్‌ వరంగల్‌ నుంచి సీఎస్‌బీ వరంగల్‌, జి.రామకృష్ణచారి పీసీఆర్‌ వరంగల్‌ నుంచి నర్సంపేటకు బదిలీ అయ్యారు.

పాఠశాల విద్యాశాఖ వరంగల్‌ ఆర్‌జేడీగా వెంకటనర్సమ్మ

విద్యారణ్యపురి: పాఠశాల విద్యా వరంగల్‌ ఆర్‌జేడీగా (రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌) పుల్‌ అడిషనల్‌ చార్జి (ఎఫ్‌ఏసీ) బి.వెంకటనర్సమ్మను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వెంకటనర్సమ్మ హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ (సర్వీసెస్‌)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలం క్రితమే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మీకి వరంగల్‌కు పోస్టింగ్‌ ఇవ్వగా ఆమె బాధ్యతలు చేపట్టలేదు. సెలవుల్లో కొనసాగుతున్నారు. దీంతో ఆమెస్థానంలో వెంకటనర్సమ్మకు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కేయూ మహిళా

చెస్‌ జట్టు ఎంపిక

కేయూ క్యాంపస్‌: హైదరాబాద్‌లోని ఉమెన్స్‌ యూనివర్సిటీలో ఈనెల 9నుంచి ప్రారంభమై 12వ తేదీవరకు జరగనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొననున్న కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సె క్రటరీ డాక్టర్‌ టి.శాస్త్రి సోమవారం తెలిపారు. జట్టులో చిలకబత్తిని నవ్య, పూజశ్రీపుప్పాల, మాధురి కర్జ్‌, బచ్చలి నవ్య, కోరం పూజిత, కుర్సం సాహిత్య ఉన్నారు. టీజీటీ డబ్ల్యూఆర్‌డీసీ(ఖమ్మం) పీడీ బి.రమ్య, కోచ్‌కమ్‌ మేనేజర్‌గా వ్యవరిస్తున్నారని శాస్త్రి తెలిపారు.

నేటినుంచి శ్రీభద్రకాళి సన్నిధిలో కార్తీకదీపాలు

హన్మకొండ కల్చరల్‌ : కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా నేటి(మంగళవారం)నుంచి ప్రతీరోజూ శ్రీభద్రకాళి దేవాలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈఓ రామల సునీత తెలిపారు. ఈ మాసంలో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, రుద్రహోమాలుంటాయని పేర్కొన్నారు. శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం మణిపూర్‌ రాష్ట్రం నోని జిల్లాకు చెందిన ఐఏఎస్‌ అధికారి శ్రీధర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement