● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్‌రెడ్డి
హన్మకొండ: వినాయక నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యుత్ శాఖపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండలోని బందం చెరువు, సిద్ధేశ్వర గుండం, వరంగల్‌లోని ఉర్సుగుట్ట నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించారు. విద్యుత్ సరఫరా ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక నిమజ్జన కేంద్రాలు, ప్రధాన ఊరేగింపు మార్గాలు, గణేశ్ మండపాల వద్ద విద్యుత్ తీగల సరిజేత, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్టే వైర్లు, సర్వీస్ వైర్లు తదితర విద్యుత్ మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ ఎస్‌ఈలు బి.సామ్యనాయక్, ఎ.ఆనందం, డీఈలు జి.సాంబరెడ్డి, ఎస్.మల్లి కార్జున్ ఏడీఈలు పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎం.ఇంద్రసేనారెడ్డి, చంద్రమోహన్, ఏఈలు పాల్గొన్నారు.


