బల్దియా కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆదివారంలోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్, విలీన గ్రామాల పరిధి చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్య చర్యలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్, సంజయ్‌కుమార్, మహేందర్, సంతో శ్‌బాబు, మాధవీలత, డీఈ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
యూజీడీ పనులపై దృష్టి సారించాలి..
నగరంలో యూజీడీ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎంయూ) పనులను గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. పీఎంయూ ఏర్పాట్లను పరిశీలించారు.
పనులు వేగవంతం చేయండి
హసన్‌పర్తి: హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారి మార్గమధ్యలోని కిట్స్ కళాశాల జంక్షన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కమిషనర్ వెంకన్న ఆదేశించారు. శనివారం కిట్స్ కళాశాల జంక్షన్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


