ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

వినాయక విగ్రహాలు తరలించే వాహనాలపై ఇలా..

నగరంలో తిరిగే వాహనాలు

హసన్‌పర్తి: వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ శ్వేత తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర కొనసాగుతుండడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ చెప్పారు. భారీ వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా ఉండేందుకు ట్రైసిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

భారీ వాహనాల మళ్లింపు ఇలా..

● ములుగు–భూపాలపల్లి వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలు ఆరెపల్లి రింగ్‌ రోడ్డు నుంచి చింతగట్టు మీదుగా..

● భూపాలపల్లి – పరకాల నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు ఆరెపల్లి ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా కరుణాపురం వయా వెంకటాపూరం, ఐనవోలు మీదుగా

● భూపాపల్లి–పరకాల నుంచి నర్సంపేటకు వెళ్లే వాహనాలు కొత్తపేట–రెడ్డిపాలెం మీదుగా..

● కరీంనగర్‌ – ఖమ్మం వెళ్లే వాహనాలు చింతగట్టు ఓఆర్‌ఆర్‌ మీదుగా కరుణాపురం, వెంకటపూరం మీదుగా..

● ఖమ్మంనుంచి కరీంనగర్‌–హైదరాబాద్‌ వైపునకు వెళ్లే భారీ వాహనాలు పున్నేలు క్రాస్‌ రోడ్డు, ఐనవోలు, వెంకటపూర్‌, కరుణాపురం మీదుగా..

● హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు కరుణాపురం, వెంకటపూర్‌, ఐనవోలు, పున్నేలు క్రాస్‌రోడ్డు మీదుగా..

● నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాలు సిటీ అవతల నిలిపివేయాలి. నిమజ్జనం సందర్భంగా భారీ వాహనాలకు అనుమతి లేదు.

● హైదరాబాద్‌ నుంచి నర్సంపేటకు వెళ్లే వాహనాలు కరుణాపురం నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా ఆరెపల్లి వయా ఆత్మకూరు, కటాక్షపూర్‌, మల్లంపల్లి మీదుగా..

● నర్సంపేట నుంచి వరంగల్‌, హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు వయా మల్లంపల్లి, కటాక్షపూర్‌, ఆత్మకూరు, ఆరెపల్లి ఓఆర్‌ఆర్‌ మీదుగా..

సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం అనంతరం న్యూశాయంపేట వైపునకు

న్యూశాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాల వాహనాలు హంటర్‌రోడ్డు, అదాలత్‌, హనుమకొండ చౌరస్తా, మీదుగా ..

ఎకై ్సజ్‌ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు బంధం చెరువులో నిమజ్జనం

చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపునకు..

శోభాయాత్ర వెళ్లే మార్గాల్లో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో వాహనాలు నిలుపరాదు. ఇందుకు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సీపీ శ్వేత కోరారు.

నిమజ్జన వేళ నగరంలో వాహనాల మళ్లింపు

23 నుంచి 25వ తేదీ వరకు అమలు

భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

ములుగు, పరకాల వైపు నుంచి హనుమకొండ వైపునకు వచ్చే ఆర్టీసీ బస్సులు వయా పెద్దమ్మ గడ్డ నుంచి కేయూసీ, సీవీఓ, అంబేడ్కర్‌ సెంటర్‌, ఏషియన్‌ శ్రీదేవి మాల్‌, మీదుగా బస్టాండ్‌

హనుమకొండ బస్టాండ్‌ నుంచి బయల్దేరి ములుగు, కరీంనగర్‌ వైపునకు వెళ్లే బస్సులు వయా ఏషియన్‌ శ్రీదేవిమాల్‌, అంబేడ్కర్‌ సెంటర్‌, సీపీఓ ద్వారా కేయూసీ జంక్షన్‌ మీదుగా..

హనుమకొండ బస్టాండ్‌ నుంచి బయల్దేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు వయా బాలసముద్రం, అదాలత్‌, హంటర్‌ రోడ్డు మీదుగా..

వరంగల్‌ బస్టాండ్‌ నుంచి హనుమకొండ వైపు వచ్చే బస్సులు చింతల్‌ బ్రిడ్జి నుంచి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్‌ పంప్‌ సెంటర్‌, ఉర్సుగుట్ట అదాలత్‌, బాలసముద్రం రోడ్డు మీదుగా..

కాజీపేట నుంచి వరంగల్‌ వైపునకు వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలు ఫాతిమా జంక్షన్‌, వడ్డేపల్లి చర్చి, కేయూసీ జంక్షన్‌, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు, ఎంజీఎం, జెమిని, పోతన జంక్షన్‌, అండర్‌ బ్రిడ్జి, హెడ్‌ పోస్టాఫీస్‌, వరంగల్‌ బస్టాండ్‌, వెంకట్రామ సర్కిల్‌

వరంగల్‌ నుంచి కాజీపేట వైపునకు వెళ్లే కార్లు, ఇతర చిన్నవాహనాలు వెంకట్రామ సర్కిల్‌, వరంగల్‌ బస్టాండ్‌, హెడ్‌ పోస్టాఫీస్‌, అండర్‌ బ్రిడ్జి పోతన జంక్షన్‌, జెమిని, ఎంజీఎం, ములుగు రోడ్డు, పెద్దమ్మ గడ్డ, కేయూసీ జంక్షన్‌, వడ్డేపల్లి చర్చి, ఫాతిమా జంక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement