యూత్‌ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌లు | - | Sakshi
Sakshi News home page

యూత్‌ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌లు

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

యూత్‌ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌లు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ (టీపీవైసీ)లో సంస్థాగత మార్పులు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు కొత్త ఇన్‌చార్జులను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాలకు పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌ జిల్లాకు ముచల సాయి మనోజ్‌కుమార్‌ యాదవ్‌ను సెక్రటరీ ఇన్‌చార్జ్‌గా, హనుమకొండ జిల్లాకు పాడాల రాహుల్‌ను జనరల్‌ సెక్రటరీ ఇన్‌చార్జ్‌ గా నియమించారు. ఈ రెండు జిల్లాల వ్యవహారాలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్‌ రూపవత్‌ పర్యవేక్షించనున్నారు. జనగామ జిల్లాకు జనరల్‌ సెక్రటరీగా చంద్రిక దుబ్బక, మహబూబాబాద్‌ జిల్లాకు జనరల్‌ సెక్రటరీగా అలువాల కార్తీక్‌, సెక్రటరీగా అశ్విన్‌ ఏకేలను నియమించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహిపాల్‌ ఒరుగంటి, ములుగు జిల్లాకు బండిగ రాకేష్‌కు బాధ్యతలు అప్పగించారు.

క్షేత్రస్థాయిలో సమన్వయం..

కొత్తగా నియమితులైన ఇన్‌చార్జులు తమ పరిధిలోని జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయి కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షుడు నియామక ఉత్తర్వులో సూచించారు. నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. యువతను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో యూత్‌ కాంగ్రెస్‌ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కొత్త బాధ్యులు దృష్టి సారించనున్నారు.

ఉమ్మడి వరంగల్‌లో ఏడుగురు

రాష్ట్ర నేతలకు బాధ్యతలు

వరంగల్‌, హనుమకొండ

జిల్లాలపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement