● కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి
కాజీపేట అర్బన్ : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటితరానికి ఆదర్శమని కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి తెలిపారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం న్యూశాయంపేట జంక్షన్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ ఐలమ్మ స్ఫూర్తితో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధి కారత, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు ఎన్.రవి, వైవీ గణేష్, ఎల్.కిశోర్‌కుమార్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, లక్ష్మ ణ్, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు.


