నిధుల మోడల్‌ ఇదీ.. | - | Sakshi
Sakshi News home page

నిధుల మోడల్‌ ఇదీ..

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

రూ.5,257.20 కోట్ల ప్రాజెక్టులో నిధుల సమీకరణ కూడా ప్రత్యేక విధానంలో జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతోపాటు జర్మన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రుణం తీసుకునే ప్రతిపాదన ముందుకు వచ్చింది. కేంద్ర పట్టణాభిృద్ధి శాఖ పరిధిలోని అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద వరంగల్‌ యూజీడీకి రూ.4,674.60 కోట్లకు ఆమోదం లభించినట్లు జూన్‌ 2026 నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో కేంద్రం, రాష్ట్రం చెరో 25 శాతం వాటాగా రూ.1,168.65 కోట్ల చొప్పున, మిగిలిన రూ.2,337.30 కోట్లను కేఎఫ్‌డబ్ల్యూ రుణంగా సమకూర్చే విధానం ప్రతిపాదించారు. మొత్తం 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్‌జోన్లుగా పనులను విభజించి టెండర్లు పిలవనున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. గ్రేటర్‌ వరంగల్‌లో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ మురుగునీటి పారుదలకు ఓపెన్‌ డ్రెయినేజీ వ్యవస్థపైనే ఆధారపడాల్సి వస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు, వర్షపు నీరు కలవడం.. రోడ్లపైకి నీరు చేరడం.. కాలనీల్లో దుర్వాసన, దోమల బెడద పెరగడం సాధారణమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement