ఈవీ బస్‌డిపో! | - | Sakshi
Sakshi News home page

ఈవీ బస్‌డిపో!

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

– 8లోu 10 ఎకరాల్లో ప్రతిపాదన.. 100 ఎలక్ట్రిక్‌ బస్సులకు అవకాశం

న్యూస్‌రీల్‌

వరంగల్‌
మామునూరుకు

విద్యుత్‌ ఆల్‌టైం రికార్డు

వర్షాకాలంలోనూ ఎండలు మండుతుండడంతో రోజురోజుకూ విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతోంది.

శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

చార్జింగ్‌ పాయింట్లు, మౌలిక వసతులు,

వందల మందికి ఉపాధి

కలెక్టర్‌ సత్యశారద త్వరగా నిర్ణయం

తీసుకుంటేనే మేలు

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ సమీపంలోని మామునూరులో ఎలక్ట్రిక్‌ బస్‌ డిపో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పశుసంవర్థక శాఖకు చెందిన సుమారు 10 ఎకరాల భూమిని డిపో కోసం వినియోగించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ, రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. భూముల బదలాయింపుపై కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద నిర్ణయం తీసుకుంటే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ప్రత్యేక చొరవ చూపెడితే ఈ ప్రాజెక్టు త్వరితగతిన పట్టాలెక్కనుంది.

డిపో, విద్యుత్‌ మౌలిక వసతులకు నిధులు..

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2024 అక్టోబర్‌ 28న పీఎం ఈబస్‌ సేవా–పేమెంట్‌ సెక్యూరిటీ మెకానిజం (పీఎస్‌ఎం) పథకాన్ని ప్రారంభించింది. దేశంలో 38,000కుపైగా ఎలక్ట్రిక్‌ బస్సులకు సంబంధించిన ఈ పథకం కోసం రూ.3,435.33 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. బస్సులను నడిపే ఆపరేటర్లు, తయారీదారులకు ప్రజారవాణా సంస్థల నుంచి రావాల్సిన చెల్లింపులకు భద్రత కల్పించడంతో పాటు డిపో, విద్యుత్‌ మౌలిక వసతులకు సంబంధించి ఈ పథకం నుంచి ప్రత్యేక నిధులు చెల్లించనున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్‌ బస్సులను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) విధానంలో ఆపరేటర్లు నిర్వహిస్తారు. రవాణా సంస్థ నెలవారీగా వారికి చెల్లించాలి. ఒకవేళ ప్రజారవాణా సంస్థ నుంచి చెల్లింపులు ఆలస్యమైతే, పీఎస్‌ఎం ఫండ్‌ ద్వారా తాత్కాలికంగా చెల్లిస్తారు. ఇందుకోసం కన్వర్జెన్సీ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) అమలు సంస్థగా వ్యవహరిస్తుంది. తర్వాత ఆ మొత్తాన్ని సంబంధిత రాష్ట్రం లేదా రవాణా సంస్థ నుంచి తిరిగి రాబడతారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ రవాణా సంస్థలతో ఈ–బస్‌ సేవలు నిర్వహించేందుకు ప్రైవేట్‌ ఆపరేటర్లు, బస్సుల తయారీ సంస్థలకు చెల్లింపులపై నమ్మకం పెరుగుతుంది. ఒక్కో బస్సుకు పీఎస్‌ఎం కింద 12 సంవత్సరాల వరకు చెల్లింపు భద్రత కల్పించే నిబంధన ఉంది.

పెరగనున్న ఉపాధి అవకాశాలు..

డిపో ఏర్పాటుతో డ్రైవర్లు, సాంకేతిక సిబ్బంది, చార్జింగ్‌ స్టేషన్‌న్ల నిర్వహణ, భద్రత, పారిశుద్ధ్యం, పరిపాలన, నిర్వహణ తదితర విభాగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల చిన్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మామునూరుకు రవాణా సౌకర్యం, వరంగల్‌కు పర్యావరణహిత ప్రజా రవాణా, యువతకు ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది.

విమానాశ్రయం, శివారు ప్రాంతాలకు లాభం

మామునూరు డిపోకు మరో ప్రత్యేకత విమానాశ్రయం, నగరానికి సమీపంలో ఉండడం కలిసిరానుంది. భవిష్యత్‌లో విమానాశ్రయం నుంచి వరంగల్‌ నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ఈ–బస్‌ సర్వీసులు నడిపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మామునూరు, వర్ధన్నపేట పరిసరాలు, నగర శివారు ప్రాంతాల ప్రజలకు వరంగల్‌ నగరానికి చేరుకునే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది.

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం పీఎం ఈ–బస్‌ సేవా పథకం కింద వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్‌ బస్సులు, నిజామాబాద్‌కు 50 బస్సులు అర్హత కల్పించారు. 2025లో కేంద్రం ఇచ్చిన సమాచారంలో వరంగల్‌ ఈ పథకంలో పాల్గొనలేదని పేర్కొంది. తాజా కేంద్ర వివరాల్లో కూడా వరంగల్‌కు 100 బస్సుల కేటాయింపు ఉండడంతో మామునూరులో ప్రతిపాదిస్తున్న డిపోకు ప్రాధాన్యం పెరుగుతోంది. అవసరమైన భూమి, విద్యుత్‌ కనెక్షన్‌, చార్జింగ్‌ వ్యవస్థ, పార్కింగ్‌, వర్క్‌షాపు, సిబ్బంది, సౌకర్యాలు సిద్ధమైతే ఈ–బస్సుల నిర్వహణకు అనువైన కేంద్రంగా మామునూరు మారే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement