వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Sep 10 2026 3:38 AM | Updated on Sep 10 2026 3:38 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

నత్తనడకన ‘ఇన్‌స్పైర్‌’

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇన్‌స్పైర్‌ మనాక్‌ పురస్కారాలకు విద్యార్థుల నుంచి నామినేషన్ల నమోదు లక్ష్యం చేరుకోలేదు.

నీరులేక వెలవెలబోతున్న వర్ధన్నపేట మండలంలోని కడారి చెరువు

వినాయక ఉత్సవాలపై ఎల్‌నినో ప్రభావం

సాక్షి, వరంగల్‌: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు ఊపందుకుంటున్న వేళ నిమజ్జనంపై భక్తుల్లో ఆందోళన మొదలైంది. గణనా థుడి విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువుల్లో నీరు లేకపోవడం భక్తులకు సమస్యగా మారనుంది. ఎల్‌నినో ప్రభావంతో వరంగల్‌ నగరంతోపా టు జిల్లాలోని పలు చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పటికే వర్షాభావ ప్రభావం సాగుపై కనిపిస్తుండగా.. ఇప్పుడు వినాయక నిమజ్జనాలపైనా పడే పరిస్థితి ఏర్పడింది.

ముందస్తు ప్రణాళిక ఏదీ..?

ఉత్సవాలకు నెల ముందే నిమజ్జన ప్రాంతాలను గుర్తించి అవసరమైన నీరు, కృత్రిమ కొలనులు, క్రేన్లు, బ్యారికేడ్లు, విద్యుత్‌ దీపాలు, పారిశుద్ధ్య సిబ్బంది నియామకం చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని చెరువుల్లో నీటి పరిస్థితి, ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాల ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం స్థాని క సంస్థల అవసరానికి అనుగుణంగా తాత్కాలిక కృత్రిమ నిమజ్జన కొలనులు లేదా ట్యాంకులు ఏర్పా టు చేయాలి. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పా ట్లు, వ్యర్థాల సేకరణ, నిమజ్జనం అనంతరం శుభ్రతకు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

మట్టి విగ్రహాలపై అవగాహన కరువు

నీటి కొరత నేపథ్యంలో అధికారులు మట్టి వినా యక విగ్రహాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. కానీ, ఆ దిశగా ప్రయత్నించినట్లు లేదు. మట్టి విగ్రహాలను ఇంటి వద్దనే నీటి తొట్టె, బకెట్‌ లేదా ఇతర పాత్రలో నిమజ్జనం చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిహిస్తే పెద్ద చెరువుల్లో నిమజ్జనాలపై ఒత్తిడి తగ్గుతుందని పర్యావరణవేత్తల అభిప్రాయం. దీనికితోడు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల నిమజ్జన కొలనులు ఏర్పాటు చేయడంలేదనే విమర్శలున్నాయి.

జిల్లాలో నీటి పరిస్థితి..

● నర్సంపేట మండలంలో 69 చెరువులు, కుంటలున్నాయి. వీటిలో 20 శాతం మేర నీటిమట్టం ఉంది. విగ్రహాలను ఎక్కువగా నర్సంపేట పట్టణంలోని దామర చెరువుకే తరలిస్తారు. కానీ ప్రస్తుతం విగ్రహలు మునిగేంత నీరు లేదు.

● ఖానాపురం మండలంలో 23 చెరువులుండగా.. అశోక్‌ నగర్‌లోని దూసముద్రం చెరువు మాత్రమే పెద్దది. ఇందులో విగ్రహాలు మునిగేంత నీరులేదు. నెక్కొండ మండలంలో 19 పెద్ద చెరువులు 25 చిన్న చెరువులు, 37 కుంటలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం చెరువల్లో వినాయక నిమజ్జనానికి సరిపడా నీరు లేదు.

● చెన్నారావుపేటతోపాటు ఈర్యాతండా, ఖాదర్‌పేట, గొల్లపల్లి, మాధవనగర్‌, అక్కల్‌చెడ, సూర్యాపేట తండా తదితర గ్రామాలకు చెందిన విగ్రహాలు ఏటా నిమజ్జనం చేసే చెన్నారావుపేటలోని కోపాకుల చెరువులో నీరు అడగంటింది.

● దుగ్గొండి మండలంలోని 34 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 14 పెద్ద చెరువులున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల నేటికీ ఏ ఒక్క చెరువులోనూ నీరు నిండుగా లేదు. నల్లబెల్లి మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది.

● వర్ధన్నపేట మండలంలోని కడారి గూడెం, కట్రాల, రామవరం గ్రామాల్లోని చెరువులో కుంటలు పూర్తిగా ఎండియాయి. పర్వతగిరి, రాయపర్తి మండలంలోనూ చాలా వరకు చెరువుల్లో నీరు లేదు. సంగెం మండలం ఎల్గూర్‌ రంగంపేట చెరువు 50శాతం, గవిచర్ల ఊర చెరువు, చింతలపల్లి తాళ్లచెరువు కొండ సముద్రం, నల్లబెల్లి, కుంటపల్లి, తీగరాజుపల్లి, రామచంద్రాపురం ఊర చెరువుల్లో 30 శాతం, తీగరాజుపల్లి మధ్యల కుంట 40 శాతం నీరు ఉండగా, మిగిలిన చెరువులో కుంటల్లో 10 శాతానికి తక్కువగా నీరు ఉంది.

ప్రధాన చెరువులు,

కుంటల్లో నీరు అంతంతే..

వరంగల్‌ నగరంలోనూ పొంచి

ఉన్న నీటి కొరత

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల ఉదాసీనత

ఉర్సు రంగలీలా మైదానం, ఖిలావరంగల్‌ ఆగర్త, గుండు చెరువు, మధ్యకోట, బెస్తం చెరువు, ఆటోనగర్‌ కోట, చిన్న వడ్డెపల్లి, కట్టమల్లన్న తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో నీరు సరిపడా లేకపోవడంతో ఈసారి భారీ విగ్రహాలు మునిగే పరి స్థితి లేదు. కట్ట మల్లన్న చెరువులో ప్రతీ ఏడాది వందల విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈసారి నీరు తక్కువగా ఉండడంతో పెద్ద మొత్తంలో విగ్రహాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదు. గీసుకొండ, ఏలుకుర్తి, మనుగొండ, ఊకల్‌ మచ్చాపూర్‌, విశ్వనాథపురం గ్రామాల్లోని చెరువుల్లో వినాయక నిమజ్జనాలకు సరిపడా నీరు లేదు.

గ్రౌండ్‌

రిపోర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement