గీసుగొండ : రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమా న్య సంస్థ (ఆత్మ) ద్వారా బుధవారం మండలంలో ని అనంతారం గ్రామంలో రైతుల పూర్వ అనుభవ గుర్తింపు ఆధారిత (ఆర్‌పీఎల్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ తాటికాయల సతీష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులతో తయారు చేసుకునే జీవామృతం, ఘనజీవామృతం, వివిధ కషాయాలను వినియోగించడం ద్వారా సాగు ఖ ర్చులను తగ్గించుకోవచ్చన్నారు. దీంతో నేల సారా న్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేలలో జీవ వైవిధ్యం పెంపొందడంతోపాటు భూసారం పెరుగుతుందన్నారు. తద్వారా నాణ్యమై న, ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందవచ్చన్నారు. పత్తిలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆత్మ (ఆర్‌పీఎల్) రైతు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం కోసం ఎంపిక చేసిన 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను వర్ధన్నపేట సహాయ వ్యవసాయ సంచాలకుడు నర్సింగం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఇఫ్కో ఏరియా మేనేజర్ విశాల్ నానో యూరియా, డీఏపీ వినియోగంపై వివరించగా, ఎఫ్‌పీసీఎల్ ప్రతినిధి ప్రజ్వల్, మే నేజర్ అయేషా ప్రకృతి వ్యవసాయంలో జీవ ఎరువుల వినియోగం, మార్కెట్‌లో అందుబాటులో ఉ న్న వివిధ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గీసుగొండ మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు అఖిల, స్మిత, కావ్య, భరత్, ఎఫ్‌పీసీఎ ల్ మేనేజర్ అయేషా, నూజివీడు కంపెనీ ప్రతినిధి వెంకట్, ఉపసర్పంచ్, రైతులు మల్లయ్య, నర్సింహా రావు, వెంకటేశ్వర్లు, సుదర్శన్ పాల్గొన్నారు.
డీఏఓ విజయభాస్కర్


