నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహను బుధవారం మ ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని గిర్నిబావి పరి సర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గిర్నిబావిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి దామోదర రాజనరసింహకు మాధవరెడ్డి వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రజ లకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయడం, అత్యవసర వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల ఆరోగ్య సంక్షేమ మే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే మాధవరెడ్డి తెలిపారు.
ఎన్‌ఎస్‌యూఐ ఆరు జిల్లాల అధ్యక్షుల నియామకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ బలోపేతంపై అధి ష్టానం దృషిపెట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి బుధవారం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండకు వేణుచారి, వరంగల్–బొల్లం నితిన్‌కుమార్, జనగామ–దేశగాని హరగోపాల్‌గౌడ్, జయశంకర్ భూపాలపల్లి–పురుషోత్తం అనూప్, మహబూబా బాద్ – బి.చంటి, ములుగు–ఎం.నవనీత్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో విద్యార్థి సమస్యలను గుర్తించి పోరాటాలు చేపట్టడంతోపాటు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది.
స్వచ్ఛ వరంగల్‌కు
ఆధునిక సాంకేతికత
వరంగల్ అర్బన్: ముంబైలోని ‘బాంబే ఎగ్జిబిషన్ సెంటర్’లో జరుగుతున్న 13వ ఐఎఫ్‌ఏటీ ఇండియా–26 సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న బుధవారం పాల్గొన్నారు. తెలంగాణ మున్సిప ల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంలో పాల్గొన్న కమిషనర్ పట్టణ నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, బయోగ్యాస్, ఈ–వేస్ట్ త దితర రంగాల్లో ఆధునిక సాంకేతికతలు, వినూ త్న విధానాలు పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ద్వా రా పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, పర్యావరణహిత వరంగల్ నిర్మాణానికి మరింత ఊతమివ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సూచనలు, జ్ఞాన మార్పిడి కార్యక్రమాలు నగర పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడనున్నాయని కమిషనర్ పేర్కొన్నారు.
నేటినుంచి మిల్లింగ్ ప్రక్రియ నిలుపుదల
వరంగల్ చౌరస్తా/ఖిలావరంగల్ : రైస్‌మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వరంగల్, హనుమకొండ జిల్లాల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, రెండు జిల్లాల అదనపు కలెక్టర్లకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనెల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా గురువారంనుంచి రైస్ మిల్లులు మిల్లింగ్ ప్రక్రియను నిలుపుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతీ సీజన్ మొదలయ్యే ముందే ధాన్యాన్ని దించుకోవాలని విన్నవించుతున్నామని స్పష్టం చేశారు. కానీ బియ్యం ప్రొక్రూమెంట్ చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని, అందుకు రైస్ మిల్ల ర్లు ఆర్ధికంగా చాలా నష్టపోతున్నారని చెప్పా రు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. మిల్లింగ్ సమయంలో డ్యా మేజ్, నూకలు తదితర కారణాలతో ఏర్పడే షార్ట్‌ఫాల్‌పై మిల్లర్లపై చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాలు సమర్పించిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బూరెల సత్యనారాయణ, కోశాధికారి ఇరుకు కోటేశ్వరరావు, గౌరవ సలహాదారు తోట సంపత్‌కుమార్, దేవుని అంజయ్య, గుజ్జ ప్రభాకర్‌రావు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.


