ఇన్‌చార్జ్‌ల షెడ్యూల్..
కాశిబుగ్గ: హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నెలకొకరు చొప్పున ఇన్‌చార్జ్ అధికారి (హెచ్‌ఓడీ) పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌తో పాటు ఆర్‌ఎంఓ కలిసి హాస్పిటల్ వైద్యసేవలు, పాలనను పర్యవేక్షించేవారు. ఇంతవరకు పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు బదిలీపై వెళ్లిపోవడంతో రెండు నెలల నుంచి ఈ బాధ్యత తీసుకోవడానికి సీనియర్ వైద్యులు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. వాస్తవానికి సూపర్ హాస్పిటల్‌లో సీనియర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్‌గా నియమించే అధికారం ఎంజీఎం సూపరింటెండెంట్‌కు ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఎంజీఎం సూపరింటెండెంట్‌గా ఉన్న రాంకుమార్‌రెడ్డి సూపర్ స్పెషాలిటీలో సీనియర్ వైద్యులు డిప్యూటీగా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ వైద్యులెవరూ.. ముందుకు రాకపోవడంతో రొటేషన్ పద్ధతిపై పరిపాలనా బాధ్యతలు తీసుకునేందుకు వారి సీనియార్టీ ప్రకారం నెలకు ఒకరు చొప్పున ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో సూపర్ స్పెషాలిటీ విభాగాల హెచ్‌ఓడీలు తమ రెగ్యులర్ డ్యూటీలతో పాటు సూపర్ హాస్పిటల్ పరిపాలన వ్యవహారాలను చూసుకోవాలని ఆదేశించారు.
పాలన గాడిన పడేనా?
ఇప్పటికే సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌లో వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పరంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందించే హాస్పిటల్‌లో పరిపాలనా బాధ్యత చూడడం కత్తిమీద సాములా ఉంటుందనే విమర్శలున్నాయి. ఇందులో రోగుల సేవలతో పాటు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం భారమైనప్పటికీ గతంలో రెగ్యులర్ డిప్యూటీ సూపరింటెండెంట్‌తో పాటు ఆర్‌ఎంఓ ఉంటూ నెట్టుకొచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ లేకపోవడంతో భారమంతా ఆర్‌ఎంఓపై పడుతోంది. ఇక నూతన ఉత్వర్వుల ప్రకారం నెలకు ఒకరు చొప్పున సీనియర్ వైద్యులు ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకుంటే పరిపాలన గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల తిరిగే సరికి బాధ్యత తీసుకున్న హెచ్‌ఓడీ గడువు కాలం ముగస్తుంది. మళ్లీ కొత్త డాక్టర్ వచ్చి బాధ్యత తీసుకుంటే వారికి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. శాశ్వతంగా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తేనే రోగుల సేవలు, అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగే అవకాశం ఉంది.
న్యూరాలజీ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ డాక్టర్ ఎన్.మాధవరావు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు.
కార్డియాలజీ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ డాక్టర్ సి.మమతారెడ్డి అక్టోబర్ 1 నుంచి 31 వరకు.
సీటీవీఎస్ హెచ్‌ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ బి.సర్తాజ్ హుస్సేన్ నవంబర్ 1 నుంచి 30 వరకు.
యూరాలజీ హెచ్‌ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ సంతోశ్ డిసెంబర్ 1 నుంచి 31 వరకు.
నెఫ్రాలజీ హెచ్‌ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ చాడ రమేశ్ జనవరి 1, 2027 నుంచి 31 వరకు.
పిడియాట్రిక్ సర్జరీ హెచ్‌ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు
ఇన్‌చార్జ్ అధికారిగా విధులు
రోగులకు మెరుగైన వైద్యం, అడ్మినిస్ట్రేషన్ బాగు పడేదెలా?


