హన్మకొండ: విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ విమర్శించారు. హనుమకొండ నయీంనగర్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ధర్మ టీచర్స్ యూనిట్ రాష్ట్ర విద్యాసదస్సు బ్రోచర్‌ను వడ్లకొండ వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మ టీచర్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర విద్యాసదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్మ టీచర్ యూనిట్ రాష్ట్ర కోకన్వీనర్ దామెర ఉపేందర్ మాట్లాడుతూ ఈసదస్సులో పలు అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలు విద్యారంగానికి తమ బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరుపుతుంటే, మన ప్రభుత్వాలు విద్యారంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో సమాజం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మేధావులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్


