ఆత్మకూరు: ఎల్‌నినో ప్రభావం ఉన్నందున ప్రజలు ఇంకుడు గుంతల నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయం, పెంచికలపేట, అగ్రంపహాడ్ గ్రామపంచాయతీలను మంగళవారం ఆయన సందర్శించారు. పెంచికలపేటలోని ఎగితే రాజయ్య పొలంలో రూ.1.18 లక్షల వీబీ రామ్‌జీ నిధులతో చేపట్టిన ఫాంపాండ్ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఫాంపాండ్, ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మాదాసి కమల పొలంలో రూ.లక్షతో నిర్మించిన పాండ్‌ను సందర్శించారు. చేపలు పెంచుతున్న తీరును చూసి రైతును అభినందించారు. మండల పరిషత్ కార్యాలయంలో తిరుమలగిరి గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళిక డేటా నమోదును తనిఖీ చేసి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్‌పీఓ రవిబాబు, ఎంపీఓ యోగిత, ఏపీఓ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పాషా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్
డెవలప్‌మెంట్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్


