మొదలైన మెడికో విద్యార్థిని ప్రీతి కేసు విచారణ | - | Sakshi
Sakshi News home page

మొదలైన మెడికో విద్యార్థిని ప్రీతి కేసు విచారణ

Aug 12 2026 7:54 AM | Updated on Aug 12 2026 7:54 AM

వరంగల్‌ లీగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్‌ మంగళవారంనుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్‌ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విధితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

దుగ్గొండి/నల్లబెల్లి/నర్సంపేటరూరల్‌: ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు దుగ్గొండి, నల్లబెల్లి, న ర్సంపేట మండలాల్లోని పీహెచ్‌సీలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌, ఓపీ రిజిస్టర్‌, మందుల వివరాలు, నెలవారి గర్భిణులు, బాలింతల నమో దు, వారికి అందుతున్న వైద్య సేవల వివరా లను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. వైద్యం అందుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణతో పాటు చుట్టూ పిచ్చిమొక్కలు విపరీతంగా ఉన్నాయని, వాటినే వెంటనే తీసివేసి శుభ్రం చేయించాలని పీహెచ్‌సీ వైద్యాధికారి కిరణ్‌రాజును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాకేష్‌, సీహెచ్‌ఓ సలోమి, హెచ్‌ఈఓ గౌస్‌, హెచ్‌వీ సంధ్యారాణి పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు

విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు టి.లింగారెడ్డి, నన్నబోయిన తిరుపతి తెలిపారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల యూఎస్సీఎస్‌ శాఖల దశలవారీ పోరాటాల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీల్లో అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద, 19న జిల్లాకేంద్రంలో ధర్నాలు, 29న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీఆర్‌సీని 2023నుంచి అమలు చేయాలని, సీపీస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని, ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ను రూపొందించి పర్యవేక్షణ పోస్టులను భర్తీచేయాలన్న డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కమిటీ రాష్ట్ర బాధ్యులు రావుల రమేష్‌, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాల బా ధ్యులు పెండెం రాజు, గొడిశాల సత్యనారాయణ, జి.ఉప్పలయ్య, కె.శ్రీనివాస్‌, బైరి స్వామి, భీమళ్ల సారయ్య, శ్రీనివాస్‌, డి.శ్రీరామ్‌, సూరయ్య, ఎ.మల్లయ్య పాల్గొన్నారు.

హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలి: సీపీ

వరంగల్‌ క్రైం: రాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు పౌరులు బాధ్యతలను కూడా తెతెలుసులకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీహర్‌ ఘర్‌ తిరంగాశ్రీపై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఔట్రీచ్‌ ప్రోగ్రాం, ఫొటో ఎగ్జిబిషన్‌ను సీపీ, కలెక్టర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగా లను స్మరించుకుంటూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడడంతోపాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని కోరారు. రాజ్యాంగంలో రాసుకున్న హక్కులు, బాధ్యతలను ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చేస్తాయని ఆమె వివరించారు. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని పే ర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్‌, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.శ్రీనివాస్‌, రజినీ లత, సమత, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement