కాశిబుగ్గ: కాళోజీ నారాయణరావు హెల్త్‌వర్సిటీ రి జిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జె.వెంకటేశ్వర్లును వైద్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్క అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్‌కుమార్, హెచ్‌ఆర్‌డీఏ అధ్యక్షుడు కె.వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి ఎస్.శిరీష్‌కుమార్, కోశాధికారి ఎం.దిలీప్‌కుమార్, జాయింట్ సెక్రటరీ శివ్వా సృజన్, అకడమిక్ కమిటీ చైర్మన్ వి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.


