● వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకం
● 14న తుది గడువు, అక్టోబర్‌లో పరీక్ష
● ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు
● ఎంపికై న వారికి ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్
సంగెం: ఆర్థికంగా వె నుకబడిన విద్యార్థుల కు కేంద్రం ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మె రిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్)తో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకంగా ఉపకార వేతనం అందించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్‌ఎంఎంఎస్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నిరుపేదలు ఉన్నత విద్యను చదువుకునేందుకు ఈ ఉపకార వేతనం ఎంతోగానో ఉపయోగపడనుంది. ఆర్థిక కారణాలతో ఉన్నత చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చింది.
ఇంటర్మీడియట్ వరకు స్కాలర్‌షిప్
ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్, గురుకుల, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పొందిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు.
దరఖాస్తు ఇలా..
అర్హత పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులు రూ.50 చొప్పున పరీక్ష రుసుం ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌సీ.తెలంగాణ.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈనెల 14వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష తెలుగు, ఆంగ్లం, హిందీ మాద్యమాల్లో రాసే వెసులుబాటు ఉంది.
అర్హులు వీరే..
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు
7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండాలి.
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి


