ఐటీఐ అభివృద్ధికి రూ.25 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఐటీఐ అభివృద్ధికి రూ.25 కోట్లు

Aug 12 2026 7:54 AM | Updated on Aug 12 2026 7:54 AM

కాశిబుగ్గ: వరంగల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి హరిచందన దాసరి ఉత్తర్వులు జారీ చేశారు. 2026–2027 సంవత్సరానికి శక్తి డిపార్ట్‌మెంట్‌ ఉపాధి, శిక్షణ విభాగం కింద నిధులను కెటాయించారు. అయితే ఐటీఐ భవన నిర్మాణానికి రూ.30 కోట్ల బడ్జెట్‌ కోసం ప్రతిపాదనలు పంపగా, రూ.25 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 1959 సంవత్సరంలో స్థాపించిన వరంగల్‌ ప్రభుత్వ బాలుర ఐటీఐ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణంలో మౌలిక సదుపాయాల కొరత, తరగతి గదులు, వర్క్‌షాపుల కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులు మంజూరు చేసినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్‌ చందర్‌ మంగళవారం తెలిపారు. కాగా వరంగల్‌ ఐటీఐకు హబ్‌ ఽహోదా, హాస్టల్‌ మంజూరు చేయాలని ఇటీవల వరంగల్‌ ఎంపీ కడియం కావ్య కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.

నూతన భవన నిర్మాణ సముదాయానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement