నర్సంపేట: పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల ని యంత్రణలో మోదీ విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనివాసరావు డి మాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్‌భాషామియా ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర మూడో రోజు మంగళవారం నర్సంపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. దేశంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లాఖాద్రి, దండు లక్ష్మణ్, గన్నారపు రమేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


