● జిల్లా టీబీ వైద్యాధికారి ప్రదీప్‌రెడ్డి
శాయంపేట: ప్రాథమిక దశలోనే టీబీ గుర్తించి పూర్తికాలం మందులు వాడితే వ్యాధిని నిర్మూలించవచ్చని జిల్లా టీబీ వైద్యాధికారి ప్రదీప్‌రెడ్డి పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫేజ్–2లో భాగంగా మంగళవారం కాట్రపల్లి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 14 సంవత్సరాలు పైబడిన పిల్లల నుంచి వృద్ధుల వరకు టీబీ ఎక్స్‌రే, తెమడ పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్ ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ మద్యపానం, పొగతాగడం వల్ల టీబీ సోకుతుందన్నారు. టీబీ వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. మండల వైద్యాధికారి సాయికృష్ణ, పీడీఎంఓ డాక్టర్ విద్యశ్రీ, సీహెచ్‌ఓలు మాధవరెడ్డి, ప్రేమలత, టీబీ స్టాఫ్ సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ చలపతిరావు, సూపర్‌వైజర్ సీతారాంనాయక్, లాబ్ టెక్నీషియన్ కృష్ణ, రేడియో గ్రాఫర్ మహేశ్, సదానందం, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


