రూ.కోట్ల విలువైన భూమి గోల్‌మాల్‌ ! | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్ల విలువైన భూమి గోల్‌మాల్‌ !

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

పరకాల: కోట్ల రుపాయల విలువైన తమ భూములను నకిలీ ధ్రువపత్రాలతో కొందరు అక్రమంగా పట్టా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని పరకాలకు చెందిన కొందరు భూబాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పరకాల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూబాధితులు లక్కం సురేశ్‌, పొరండ్ల రాజయ్య, రాంశెట్టి రాజేందర్‌తో పాటు తిక్క రాజయ్య, తిక్క శంకరయ్య, తిక్క దేవేందర్‌ పరకాల పట్టణంలో తమ భూమి విషయంలో జరుగుతున్న అన్యాయంపై గోడు వినిపించారు. లక్కం సురేశ్‌ మాట్లాడుతూ.. పరకాల శివారులోని 689 సర్వే నంబర్‌లోని 15 గుంటల వ్యవసాయ భూమిని 2013లో కొలగాని నాగయ్య వద్ద కొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామన్నారు. (నాగయ్య మనవడు రామిశెట్టి రాజేందర్‌ నుంచి పావుశెట్టి రాజు కొన్నాడు. అతడి నుంచి సురేశ్‌ భూమి కొన్నాడు) ఈ నేపథ్యంలో అదే సర్వే నంబర్‌లో కొంత భూమి నాగయ్య వారసుడు కొలగాని లింగయ్య పేరిట ఉందని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మొత్తం భూమి తమదేనని కాగితాలు సృష్టించి లింగయ్య అక్రమంగా పట్టా చేసుకున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లింగయ్య, అతడి కుమారుడు నాగరాజు అరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయమై పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రిజిష్ట్రేషన్‌ చేసిన భూములను మరొకరి పేరిట ఎలా పట్టా చేస్తారని స్థానిక తహసీల్దార్‌ను నిలదీసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్‌ రూ.50 కోట్ల విలువైన భూములను అన్యాయంగా ఇతరుల పేరిట మార్చినట్లు ఆరోపించారు. లింగయ్య, అతడి కుమారుడు నాగరాజు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు.

న్యాయం చేయాలంటూ భూ బాధితుల ఆవేదన

రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆగ్రహం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement