నర్సంపేట: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలో ఆదివాసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నారాయణరెడ్డి, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, ఆదివాసీ సంఘం నాయకులు గట్టి పాపయ్య, జగ్గారావు, నర్సింహారావు, గొంది నాగేశ్వర్‌రావు, ఎల్లయ్య, ప్రణయ్‌దీప్, రవి, లక్ష్మ య్య, పాపయ్య, రామస్వామి, కృష్ణమూర్తి, సమ్మయ్య, వీరస్వామి, సదానందం తదితరులు పాల్గొన్నారు. అలాగే మహేశ్వరం గ్రామంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి చిన్న చంద్రన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.


