● కిక్కిరిసిన జాతీయ రహదారి
నర్సంపేట: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కార్లతో కూడిన కాన్వాయ్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి నల్లబెల్లికి ఆదివారం వచ్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కేసీఆర్ కాన్వాయ్ వరంగల్‌కు చేరుకోగానే కార్లతో అనుసరించి నల్లబెల్లికి చేరుకోవడంతో భారీ కార్ల ర్యాలీ ఏర్పడింది. మల్లంపల్లి నుంచి నర్సంపేట వరకు 365 జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది.


