నెరవేరుతున్న పేదల సొంతింటి కల | - | Sakshi
Sakshi News home page

నెరవేరుతున్న పేదల సొంతింటి కల

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

నెరవేరుతున్న పేదల సొంతింటి కల

కమలాపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరబోతోందని కుడా చైర్మన్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఒడితల ప్రణవ్‌ అన్నారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. మండలంలోని కమలాపూర్‌, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద ఏర్పాట్లను ఆదివారం వారు పరిశీలించి మాట్లాడారు. నిరుపేదలు కలలుగన్న సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైందని, సోమవారం రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి విడతలో ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రెండో విడత మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిపేదవారిని ఆదుకుంటామన్నారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ జెండా గద్దె ఆవిష్కరణ స్థలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ తౌటం ఝాన్సీరవీందర్‌, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్‌, హుజూరాబాద్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలసాని రమేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు కమలాపూర్‌కు రానున్న మంత్రులు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం కమలాపూర్‌కు రానున్నట్లు ఎంపీడీఓ గుండె బాబు తెలిపారు. గూడూరు, కమలాపూర్‌, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను గూడూరులో ప్రారంభించిన అనంతరం మండల కేంద్రంలోని ఉమామహేశ్వర గార్డెన్స్‌లో లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement