నేడు ఎల్కతుర్తికి మంత్రులు | - | Sakshi
Sakshi News home page

నేడు ఎల్కతుర్తికి మంత్రులు

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

ఎల్కతుర్తి: మండల కేంద్రంలో నేడు (సోమవారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాల భవనాన్ని ప్రారంభించడంతో పాటు తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాయకులు, అఽధికారులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

స్థలాన్ని పరిశీలించిన ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ రవి..

తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎన్‌.రవి ఆదివారం మండల కేంద్రంలో స్థలాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ ప్రసాద్‌రావు, ఈఈ దేవక చౌహాన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement