న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్నాం

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్నాం

కాశిబుగ్గ: న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అదే నమ్మకంతోనే కార్మికుల పక్షాన పోరాడుతున్నామని ఆజంజాహి మిల్స్‌ వీఆర్‌ఎస్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఆదివారం వరంగల్‌ చింతల్‌ బ్రిడ్జి వద్ద వీఆర్‌ఎస్‌ అసోసియేషన్‌ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేశ్‌ మాట్లాడుతూ.. 134 మంది మిల్లు కార్మికులకు 200 గజాల చొప్పున ఇచ్చినట్లుగానే మిగతా 318 మందికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పాండవుల సమ్మయ్య, తౌటం రమేశ్‌, సంజీవ్‌ పాల్గొన్నారు.

ఆజంజాహి మిల్స్‌ వీఆర్‌ఎస్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement