మంత్రికి పండుగల నివేదిక అందజేత | - | Sakshi
Sakshi News home page

మంత్రికి పండుగల నివేదిక అందజేత

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

హన్మకొండ కల్చరల్‌: కొన్నేళ్లుగా హిందువుల పండుగల తేదీల్లో గందరగోళం ఏర్పడుతోంది. ఈనేపథ్యంలో తెలంగాణ ధృక్‌ సిద్ధాంత పంచాంగకర్తలు పండుగల తేదీల నిర్ణయాలను శాస్త్రబద్ధంగా పరిశీలించి తీర్మానించారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఽతెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. ధృక్‌ సిద్ధాంత పంచాంగకర్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అవసరాల ప్రసాద్‌శర్మ, సిద్ధాంతి పురోహితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర నాగేంద్రశర్మ, ధూపదీప వైవేద్య రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు పెరంబదూర్‌ శ్రీకాంత్‌ మంత్రికి నివేదికను అందించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పండితులు అందించిన నివేదికను పురోహితులకు, అన్ని కులాల అర్చకులకు ప్రభుత్వం ద్వారా ముందస్తుగా పండుగల వివరాలు అందిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement