పర్వతగిరి: అన్నారం షరీఫ్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి రెండు వైన్ షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై బోగం ప్రవీణ్ కథనం ప్రకారం... గ్రామంలోని వెంకటేశ్వర వైన్స్, దుర్గశ్రీ వైన్స్ వెనుక భాగంలో దొంగలు డోర్ గ్రిల్స్‌ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. రూ.1.50 లక్షల నగదు, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. యజమాని జి.రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


