విద్యార్థులకు సైన్స్‌ నాటిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సైన్స్‌ నాటిక పోటీలు

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

పోటీల వివరాలు..

జిల్లాకు పేరుకు తేవాలి

కాళోజీ సెంటర్‌: తరగతి గది దాటి పుస్తకాల్లోని విజ్ఞానాన్ని నాటకరంగం ద్వారా సమాజానికి చాటిచెప్పేందుకు పాఠశాలల విద్యార్థులు సిద్ధమవుతున్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉద్దేశించిన దక్షిణ భారతస్థాయి సైన్‌్స్‌ నాటిక పోటీలు–2026 షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో పోటీలను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖను ఆదేశించింది. ఈ ఏడాది నాటిక పోటీలకు సైన్స్‌ అండ్‌ సొసైటీ ప్రధాన అంశంగా నిర్ణయించారు.

నాటిక పోటీల అంశాలు..

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌: కృత్రిమ మేధ నేస్తమా?

సాధనమా? లేక భవిష్యత్‌ ముప్పా?

ఈవీ వాహనాలు : పర్యావరణ పరిరక్షణలో ముందడుగు.

నక్షత్రాంతర ఆవాసాలు : నింగిలో మనుషుల కొత్త కాపురాలు.

సముద్రాల పునరుద్ధరణ : భవిష్యత్‌ తరాల భద్రత

పోటీల నిబంధనలు ఇవే..

6 నుంచి 10వ తరగతి విద్యార్థులు పోటీ పడవచ్చు. నాటిక నిడివి గరిష్టంగా 30 నిమిషాలు మించకూడదు. స్టేజ్‌ ఆర్గనైజేషన్‌కు 15 నిమిషాలు ఇస్తారు. ఒక బృందంలో గరిష్టంగా 10 మందికి (ఒక దర్శకుడు, ఒక రచయిత, 8 మంది నటులు) మాత్రమే అవకాశం ఉంటుంది. తెలుగు లేదా ఇంగ్లిష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రదర్శించవచ్చు (ఇతర భాషల వారు ఇంగ్లిష్‌లో అనువాదం ఇవ్వాలి). కంటెంట్‌ పూర్తిగా సొంతంగా రాసిందై ఉండాలి. మూఢనమ్మకాలు, తప్పుడు శాసీ్త్రయ ప్రకటనలు నాటికలో ఉండకూడదు.

స్థాయి గడువు తేదీలు వేదిక

మండల, జిల్లా సెప్టెంబర్‌ 3 లోపు ––––

రాష్ట్రస్థాయి సెప్టెంబర్‌ 25, 26 హైదరాబాద్‌

దక్షిణ భారత నవంబర్‌ 19, 20 బెంగళూరు

జాతీయ జనవరి 2027 కోల్‌కతా

ఈ ఏడాది ఇతివృత్తం సైన్స్‌ అండ్‌ సొసైటీ

సెప్టెంబర్‌ 25, 26 తేదీల్లో

రాష్ట్రస్థాయి పోటీలకు ఏర్పాట్లు

కళలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో తెలంగాణకు జాతీయస్థాయిలో మంచి పేరు ఉంది. ఆ ఘనతను ఈ సైన్స్‌ నాటిక పోటీల్లోనూ నిలబెట్టుకోవాలి. పాఠశాలస్థాయిలో విద్యార్థులు కేవలం మమ అనిపించకుండా, సాంస్కృతిక రంగానికి పేరుతేవాలి. పాఠశాలలను గుర్తించి ప్రత్యేక శిక్షణతో పోటీలకు సిద్ధం చేయాలి.

– డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, జిల్లా సైన్స్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement