హెపటైటిస్‌ నియంత్రణకు కృషిచేయాలి | - | Sakshi
Sakshi News home page

హెపటైటిస్‌ నియంత్రణకు కృషిచేయాలి

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

న్యూశాయంపేట: జిల్లాలో వైరల్‌ హెపటైటిస్‌ నియంత్రణకు కృషిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. జాతీయ వైరల్‌ హెపటైటిస్‌ నియంత్ర (ఎన్‌వీహెచ్‌సీపీ) అమలులో భాగంగా కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హైరిస్క్‌ గ్రూపులకు హెపటైటిస్‌–బీ వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రాజారెడ్డి, నర్సంపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దామోదరబాయి, జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఉష, వర్ధన్నపేట డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రామ్మూర్తి, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్‌ నిర్మల, అధికారులు పాల్గొన్నారు.

గురుకులాల్లో విద్యార్థులకు

వసతులు కల్పించాలి

ప్రభుత్వ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా, మండలస్థాయి ప్రత్యేక అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 74 ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీబీసీడీఓ పుష్పలత అధికారులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్ష

ఖిలా వరంగల్‌ ఖుష్‌మహల్‌ వేదికగా ఈనెల 15న నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వహణ, వేదిక ఏర్పాట్లు పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, ట్రాఫిక్‌, భద్రత, వైద్య సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్‌, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.

అధికారుల సమీక్షలో

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement