సమన్వయంతో ఇండెంట్లు రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో ఇండెంట్లు రూపొందించాలి

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

నర్సంపేట రూరల్‌: వైద్య కళాశాల విభాగాధిపతులు, జనరల్‌ ఆస్పత్రి విభాగాధిపతులు సమన్వయంతో మందులు, సర్జికల్‌ ఇండెంట్లు రూపొందించాలని నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యారాణి అన్నారు. తెలంగాణ వైద్యసేవలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ అధికారులతో గురువారం కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని విభాగాల వైద్యుల సమన్వయంతో వినియోగం ఆధారంగా ఇండెంట్లను రూపొందించుకోవాలని, సీఎంఎస్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్న ఔషధాలు, సర్జికల్స్‌ కోసం పోర్టల్‌లో చూడాలని కోరారు. అనంతరం సీఎస్‌ఎం నుంచి సరఫరా చేయనున్న 638 ఔషధాలు, 536 రకాల సర్జికల్‌ పరికరాలకు సంబంధించిన జాబితాను వైద్యాధికారులు అందించారు. సమావేశంలో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ ఫార్మసీ అధికారులు, ఉప్పల భాస్కర్‌రావు, వంగ సుధాకర్‌రెడ్డి, వైద్య విభాగాధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement