హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం

కాశిబుగ్గ: సమాన పని–సమాన స్టైఫండ్‌ నినాదంతో హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ ఆయుష్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు తెలిపారు. ఆయుష్‌ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్‌ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహిస్తున్న ఆయుష్‌ హౌస్‌ సర్జన్ల సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది.

సమ్మెకు సంఘీభావం..

ఆయుష్‌ హౌస్‌ సర్జన్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు అనంతలక్ష్మి పూర్వ వైద్య విద్యార్థులు హరిరమాదేవి, రాజేశ్వరి సంపూర్ణ మద్దతు తెలిపారు.

సమ్మెలో పాల్గొంటే చర్యలు..

హౌస్‌సర్జన్ల సమ్మెకు సంఘీభావం తెలిపితే క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అనసూయ ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మెలో యూజీ విద్యార్థులు పాల్గొనరాదని, ఒకవేళ పాల్గొంటే వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు. సమస్యను జఠిలం చేస్తున్నారని హౌస్‌సర్జన్లు తెలిపారు. వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ఆయుష్‌ జేఏసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement