విద్యుత్‌ భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ భద్రతకు ప్రాధాన్యం

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

హన్మకొండ: విద్యుత్‌ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ టి.మధుసూదన్‌ అన్నారు. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ సర్కిల్‌ కార్యాలయంలో వరంగల్‌ సర్కిల్‌ పరిధిలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఏఏఓలతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతపై అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం తగదన్నారు. నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్‌ సరఫరా అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చీఫ్‌ ఇంజనీర్‌ కె.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ భద్రత విషయంలో రాజీకి తావులేదని, ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తిచేస్తూ సంస్థ ప్రతిష్టను మరింత పెంచేందుకు సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ ఎస్‌ఈ ఎ.ఆనందం, డీఈలు రాంబాబు, ఎస్‌.మల్లికార్జున్‌, తిరుపతి, హర్జి, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ సంజీవరావు, ఏడీఈలు, ఏఈలు, ఏఏఓలు పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌

టి.మధుసూదన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement