దుగ్గొండి: విద్యార్థులు లక్ష్యానిన నిర్దేషించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా లోకల్‌బాడీ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్ అన్నారు. మండలంలోని గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్య శిక్షణ పొందాలన్నారు. ప్రతి సబ్జెక్టుపైనా అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుందతి, పాఠశాల ప్రిన్సిపాల్ ఓదేల మల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం మల్లంపల్లిలోని కేజీబీవీలో నిర్వహించిన స్ఫూర్తి సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ డీఎం సంధ్యారాణి పాల్గొన్ని మాట్లాడారు. ఆడపిల్లలు అన్నీ రంగాల్లో స్ఫూర్తి దాయకంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిణి మంజుల, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


