దామెర: మండలంలోని ల్యాదెళ్లలో ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఓ వ్యక్తి నిర్మాణం చేపట్టినట్లల స్థానికులు తెలిపారు. గ్రామంలోని సర్వే నంబర్ 38లో కొంత భూమి అసైన్డ్ కాగా మరికొంత భూమిలో నిర్మించిన దేవాదుల పంప్ హౌజ్ క్వార్టర్స్‌ను ఇటీవల స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌కు కేటాయించారు. మిగిలిన ప్రభుత్వ భూమిలో ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరిగోడ నిర్మించడంతోపాటు బోర్ వేయించాడు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చొరవతీసుకొని, చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


