పీఆర్సీ, పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ, పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలి

Aug 3 2026 4:09 AM | Updated on Aug 3 2026 4:09 AM

కాళోజీ సెంటర్‌: పీఆర్సీ, పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్‌ డిమాండ్‌ చేశారు. రంగశాయిపేటలో ఆదివారం నిర్వహించిన టీపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా నివేదిక తెప్పించకపోవడం, ఆరు డీఏలు పెండింగ్‌లో ఉంచడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లుల కోసం నెలకు రూ.వేయి కోట్లు విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ టీచర్లకు మెమో 57 ప్రకారం ఓపీఎస్‌ వర్తింపజేయాలని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, జీఓ 25ను సవరించాలని, 10 వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని, సెన్సస్‌ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన్‌ చెల్లించాలని, టెట్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల వీరస్వామి, మాజీ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

ఊటుకూరి అశోక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement