నర్సంపేట వాసికి ఎక్స్‌లెన్స్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

నర్సంపేట వాసికి ఎక్స్‌లెన్స్‌ అవార్డు

Aug 3 2026 4:09 AM | Updated on Aug 3 2026 4:09 AM

నర్సంపేట: ఓ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో పలు విభాగాలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా నర్సంపేటకు చెందిన పడిదాల నవీన్‌కుమార్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ సివిల్‌ అండ్‌ ఇంటీరియల్‌ సొల్యూషన్స్‌లో అవార్డును తెలంగాణ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌శుక్లా సమక్షంలో ప్రముఖ నటుడు సోనూసూద్‌ అందించారు. పీహెచ్‌ఎస్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ పారిశ్రామికంగా కృషి చేస్తున్నందువల్ల ఓ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గుర్తింపులో భాగంగా పలు రంగాల వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ దశాబ్ద కాలంలో ఇంజినీరింగ్‌ కచ్చితత్వం, ఆవిష్కరణ, సమగ్రత పట్ల తనకున్న నిబద్ధత ద్వారా ప్రముఖ బహుళజాతి సంస్థలు, ప్రతిష్టాత్మక సంస్థల నమ్మకాన్ని పొందినట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement