హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఐఆర్‌ఎస్ అధికారి అపూర్వ సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, మహాదాశ్వీచనం అందజేశారు.
క్యాంపస్ సెలక్షన్స్‌కు
‘కాన్‌క్లేవ్ –26’ దోహదం
కాజీపేట అర్బన్: క్యాంపస్ సెలక్షన్స్‌లో నిట్ విద్యార్థులకు ఇండస్ట్రీ కాన్‌క్లేవ్–26 దోహదపడుతుందని నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్‌కుమార్ తెలిపారు. నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఆదివారం నిట్ సీసీపీడీ (సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్) సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ కాన్‌క్లేవ్ కెరీర్ లాంచ్ సమ్మిట్–26 సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లేస్‌మెంట్ వివరాలతో కూడిన బ్రౌచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. నిట్ విద్యార్థులు పరిశ్రమల్లో రాణించేందుకు తొలిసారిగా ఇండస్ట్రీ కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సదస్సు వేదికగా నిలుస్తుందని తెలిపారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆన్‌లైన్‌లో సదస్సును వీక్షించారు. ప్లేస్‌మెంట్‌లో విద్యార్థులు ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్, ఎక్సాన్ మొబైల్, మైక్రాన్, ట్రూవేటా పరిశ్రమల ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు.


