నర్సంపేట: తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రవాస తెలుగు సమాజంతో మమేకమయ్యేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐసీసీ–యూఎస్‌ఏ) టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్, అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆటా సదస్సులో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు.


