సంగెం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సంగెం పోలీస్‌స్టేషన్‌ను శనివారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటా రు. స్టేషన్ పరిసరాలను, సిబ్బంది కిట్‌లను, పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను స్టోర్ రూంలను పరిశీలించారు. అనంతరం పోలీస్‌సిబ్బందితో సమావేశమై శాఖ పరమైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల స్వభావం, పెండింగ్ కేసులు, దర్యాప్తులో పురోగతి, రౌడీషీటర్లు వారి కదలికలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలపై ఎస్సై వంశీకృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజల్లో పోలీస్‌శాఖపై నమ్మకం, భద్రత, భరోసా కలిగేలా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. డయల్ 100పై స్పందించి వేగంగా ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు మెరుగైన సేవలందించాలన్నారు. ఈ తనిఖీల్లో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం, పర్వతగిరి, ఐనవోలు ఎస్సైలు వంశీకృష్ణ, ప్రవీణ్, అశోక్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
సంగెం పోలీస్‌స్టేషన్ సందర్శన


