గీసుకొండ: మండలంలోని ఊకల్ సొసైటీ భూమిలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంను నిర్మించడానికి ప్రతిపాదించామని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ వి.దీపిక అన్నారు. శనివారం ఊకల్ సొసైటీ భవనం ఎదరుగా ఉన్న సొసైటీ భూమిని సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రాంతీయంగా ధాన్యం నిల్వ సామర్‌ాధ్యన్ని పెంచేందుకు గోదాం నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించామన్నారు. స్థానిక రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి, మద్దతు ధర పొందటానికి గోదాం ఉపయోగపడుతుందన్నారు. స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు స్థల పరిశీలన చేయగా జిల్లా సహకార అధికారి నీరజ వారికి సొసైటీకి సంబంధించిన భూమి వివరాలు, రవాణా వసతుల గురించి వివరించారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ కరుణాకర్, డిప్యూటీ మేనేజర్ శోభన్‌బాబు, ఏఈ శంకర్, ఎఫ్‌సీఐ మేనేజర్ జేడీ ప్రసన్నకుమార్, క్యూసీ మేనేజర్ శివకుమార్, అకౌంట్స్ మేనేజర్ భాస్కరరావు, జేఈ ఎన్.గౌతం, ఊకల్ సొసైటీ చైర్మన్ బొమ్మల రమేశ్, మేనేజర్ బి.శివ, సీఈఓ రమేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


