● మిల్లర్లపై గ్రేవ్ క్రైమ్ కేసు నమోదు
శాయంపేట: మండలంలోని గట్లకానిపర్తిలో శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, లక్ష్మీనర్సింహ ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లయీస్ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రెండు మిల్లుల్లో రూ.9.5 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తేలడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లయీస్ అధికారులు శాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం పరకాల ఏసీపీ సతీశ్‌బాబు శుక్రవారం గట్లకానిపర్తి గ్రామంలోని వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, లక్ష్మీనర్సింహా ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో పంచుల సమక్షంలో విచారణ చేపట్టి పంచానామా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గట్లకానిపర్తిలోని రెండు మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లయీస్ అధికారులు సోదాలు చేయగా.. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, వారి వద్ద ఉన్న ధాన్యాన్ని చూడగా.. తేడా ఉందని శాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రూ. 9.5 కోట్ల పైన తేడా ఉన్నందున మిల్లర్లపై చీటింగ్, గ్రేవ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నింధితులు పరారీలో ఉన్నారని విచారణ చేపట్టిన తర్వాత నింధితులను అరెస్ట్ చేసి చార్జీషీట్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ సుధాకర్‌రెడ్డి, దామెర ఎస్సై వీరభద్రారావు సిబ్బంది ఉన్నారు.
ఫైర్ సేఫ్టీ పాటించాలి
వరంగల్ అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. శుక్రవారం ఆస్పత్రులు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ లింగంతో కలిసి కాజీపేటలోని డీమార్ట్, రోహిణి ఆస్పత్రి, హనుమకొండ, వరంగల్ నగరాల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు పరిశీలించారు.


