అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి
కమలాపూర్: భూ సమస్యలు లేని గ్రామాలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం భూముల రీ సర్వే చేపడుతోందని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మండలంలోని మాదన్నపేటలో భూముల రీ సర్వేపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ భూముల రీ సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, భూముల కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్‌సింగ్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, సర్పంచ్ కత్తి రమేశ్, ఉపసర్పంచ్ రాజయ్య, ఏఎంసీ చైర్‌పర్సన్ తౌటం ఝాన్సీరవీందర్, గిర్దావర్ అమరేందర్, సర్వేయర్ గోపీకృష్ణ, జీపీఓ రాధిక, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భూ రీసర్వేలో వేగం పెంచండి
ధర్మసాగర్ : మండల పరిధి జానకీపురంలో ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ భూముల రీ–సర్వేను వేగంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి సర్వే అధికారులను ఆదేశించారు. బుధవారం సర్వేను పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడి భూ సమస్యలు, సర్వేపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ బావుసింగ్, ఏడీ నూర్ సింగ్, సర్పంచ్ భీమ్‌రెడ్డి జగన్ మోహన్ రెడ్డి, సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.


