● నోటీసుల్లేకుండా తొలగింపుపై మాజీ కౌన్సిలర్ జయమ్మ అభ్యంతరం
పరకాల: రోడ్లు, పార్కింగ్ స్థలాలను ఆక్రమించి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న దుకాణాలపై పరకాల మున్సిపల్ అధికారుల చర్యలు చేపట్టారు. రోడ్లపై వ్యాపారాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్ పి.పవన్ ఆదేశాలతో టీపీఎస్ సుమన ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తుతో చర్యలు ప్రారంభించారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పార్కింగ్ స్థలాల్లో ఉన్న దుకాణాలను తొలగించారు. నోటీసులు లేకుండా తొలగింపుపై మాజీ కౌన్సిలర్ జయమ్మ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అధికారులతో గొడవపడడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడి నుంచి మళ్లీ ప్రధాన రహదారిపై గద్దెలు నిర్మించి.. సామగ్రి పెడుతున్న దుకాణాల గద్దెలను జేసీబీ సాయంతో తొలగించారు. మున్సిపల్ అధికారుల చర్యలపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


