కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీఎంఆర్పీఎస్‌, టీబీఎంయూకేఎస్‌, ఓఎస్‌ జేఏసీతో పాటు వివిధ మున్సిపల్‌ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, సీహెచ్‌ఎంఓ అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని భరోసా కల్పించారు. ఐఎన్టీయూసీ గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు పాశం రవియాదవ్‌, ఏఐటీయూసీ మున్సిపల్‌ సంఘం అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి యాదవ్‌, ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు, టీఎంఆర్పీఎస్‌ అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ, జీడబ్ల్యూఎంసీ అధ్యక్షుడు బొట్ల రమేశ్‌, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర రాజుతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement